Telangana Govt: చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Update: 2024-09-24 09:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 26న తెలంగాణ సాయుద పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పుట్టిన రోజు వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ ఫంక్షన్ వేడుకలను అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ వేడుకలకు అయ్యే ఖర్చు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సమకూరుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ఇటీవల రవీంద్రభారతిలో జరిగిన ఐలమ్మ వర్ధంతి వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేగాక ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తూ.. ఆమె మనవరాలు శ్వేతను మహిళా కమీషన్ లో సభ్యురాలిగా నియమిస్తామని చెప్పారు. 


Similar News