Rain Alert: హైదరాబాద్ కు బిగ్ అలెర్ట్.. మరోసారి కుంభవృష్టి

హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు బిగ్ రెయిన్ అలర్ట్(Rain Alert).

Update: 2024-09-24 10:35 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగర వాసులకు బిగ్ రెయిన్ అలర్ట్(Rain Alert). నగరంలో మరికొద్దిసేపట్లో కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. కాగా ఆల్వాల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం కురుస్తుండగా.. మరికొద్ది సేపట్లో నగరమంతా జోరుగా వాన పడనుందని తెలిపింది. చాలాచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురవనుందని హెచ్చరించింది. అలాగే సాయంత్రం, రాత్రి కూడా మరోసారి భారీ వర్షం పడనున్నట్టు పేర్కొంది. నగరంతోపాటు.. కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్ లలో కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. 

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అవర్తనం వలన దక్షిణ ఒడిషా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, దాని పరిసర వాయువ్య భాగంలో అల్పపీడనం ఏర్పడింది. దీనివలన రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు ఈదురు గాలులు, ఉరుములతో కుసిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఐఎండీ(IMD) ప్రకటించింది. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..