రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
రైతులకు తెలంగాణ ప్రభుత్వం(Congress Government) శుభవార్త చెప్పింది. సోమవారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు తెలంగాణ ప్రభుత్వం(Congress Government) శుభవార్త చెప్పింది. సోమవారం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఇప్పటి వరకు 34 లక్షల 75వేల 994 మందికి రైతుల ఖాతాలో నిధుల జమ చేసింది. రెండు ఎకరాల వరకు ఉన్న రైతులకు 2223.46 కోట్లు నిధులు విడుదల చేసింది. దీంతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 37 లక్షల ఎకరాల్లో రైతు భరోసా(Rythu Bharosa) నిధులు విడుదల అయ్యాయి. దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లు రైతులు ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించారని అన్నారు. బీఆర్ఎస్(BRS) పాలన మొత్తం అధ్వాన్నం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల పాటు టైమ్ పాస్ చేసి.. ఇప్పుడు సిగ్గులేకుండా కేటీఆర్(KTR) మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. పదేళ్లు BRS చేయని మంచి రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని అన్నారు. రైతులు లబ్ధిపొందకుండా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని సీరియస్ అయ్యారు. రైతుల వద్ద కేసీఆర్(KCR)కు ఉన్న కాస్తో కూస్తో గౌరవ కూడా కేటీఆర్ లేకుండా చేస్తున్నారని విమర్శలు చేశారు. రైతుల ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఫైర్ అయ్యారు. వ్యవసాయ శాఖపై విమర్శలు చేయడం సరికాదని.. అభివృద్ధి చూసి కూడా రాజకీయ కుట్రలో భాగంగా విమర్శలు చేస్తే.. ఎంపీ ఫలితాలు రిపీట్ అవుతాయని హెచ్చరించారు.

