Harish Rao : మరోసారి తెలంగాణకు గుండు సున్నా.. కేంద్రంపై ఎక్స్‌లో హరీశ్ రావు ఫైర్
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరోసారి మొండి చేయి చేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది.. కానీ తెలంగాణకు పెద్ద గుండు సున్నా ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా.. మన రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం పోరాడడంలో బీజేపీ, కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు.
లోక్‌సభలో బీఆర్ఎస్ బలమైన స్థానంలో ఉండి ఉంటే.. ఈ అన్యాయాన్ని మేము ఎప్పటికీ అనుమతించే వాళ్లము కాదు.. అని అభిప్రాయపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక నిధుల కింద రూ. 15 వేల కోట్లు మంజూరు కాగా.. తెలంగాణకు మాత్రం గుండు సున్నా దక్కిందన్నారు. తెలంగాణపై ఎందుకు ఈ పక్షపాతం అని ప్రశ్నించారు. తెలంగాణను ఇతర రాష్ట్రాలతో సమానంగా చూడాలని, హక్కుగా రావాల్సిన నిధులను కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.