T-BJP: కాషాయ దళంలో నయా జోష్.. కొత్త సారథిపై వీడిన సస్పెన్స్!

తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని ప్రకటించడానికి పార్టీ అధిష్ఠానం సిద్ధం చేస్తోంది.

Update: 2025-03-19 02:39 GMT
T-BJP: కాషాయ దళంలో నయా జోష్.. కొత్త సారథిపై వీడిన సస్పెన్స్!
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీజేపీకి కొత్త సారథిని ప్రకటించడానికి పార్టీ అధిష్ఠానం సిద్ధం చేస్తోంది. రేపో, మాపో కొత్త అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే అధిష్ఠానం ఒక సీనియర్​నేత పేరును ఫైనల్​చేసినట్టు సమాచారం. అపార అనుభవం గల రాజకీయ నేతలను ఎంపిక చేయడానికి కమలం పార్టీ ...అభిప్రాయ సేకరణను చేపడుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలను ఎదుర్కొనే ధీటైన నేతకే పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలో తీసుకొచ్చే వ్యక్తికే అవకాశం ఇవ్వనున్నది. గత మూడు నెలల నుంచి అధ్యక్షుని ఎంపిక కోసం ఎదురు చూస్తున్న నేతలకు పార్టీ హైకమాండ్ త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది.

36 జిల్లాలకు పార్టీ అధ్యక్షుల ఎంపిక

తెలంగాణలో ఇప్పటి వరకు 36 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించగా.. మరో రెండు రోజుల్లో మిగతా జిల్లాల సారథులను ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్షుని ఎంపిక కోసం ముఖ్య నేతల అభిప్రాయలను ముఖ్యంగా సీనియర్ల సలహాలను స్వీకరించినట్టు సమాచారం. అయితే ఎవర్ని.. ఎంపిక చేసినా సర్దుబాటు చేసుకోవాలి తప్ప.. పార్టీ పెద్దలపై విమర్శలు చేయవద్దని ఇప్పటికే పార్టీ అధిష్టానం సూచించింది. అధ్యక్ష పదవికి అర డజన్​మంది పోటీపడుతున్నారు. అయితే కమలం పార్టీని సమర్థంగా నడిపే వారికే చాన్స్ కల్పిస్తామని హైకమాండ్ తేల్చి చెప్పింది. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను రచించే వ్యక్తికే కమల కిరీటం అప్పగిస్తామని బీజేపీ అధినాయకత్వం భరోసా ఇచ్చినట్టు పార్టీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

పార్టీ కేడర్‌కు ఉత్తేజం

మండలి ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ సంబరపడుతోంది. ఇటీవల జరిగిన 3 శాసనమండలి ఎన్నికల్లో రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో పార్టీ కేడర్‌కు మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. తెలంగాణలో తమకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందిన భావిస్తోంది. పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో...గత పదిరోజుల నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయం నాయకులు, కార్యకర్తలతో కళకళలాడుతోంది. కొత్త అధ్యక్షుని నాయకత్వంలో ... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా అధికారం చేపడుతామని వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. డబుల్ ఇంజిన్ నినాదం... కేంద్రంలో మోడీ సర్కార్​చేప్టటే సంక్షేమ పథకాలే తమ విజయానికి సోపానాలుగా నిలుస్తాయని వారు అంచనా వేస్తున్నారు.

పార్టీ శ్రేణులు ధీమా

హైకమాండ్​ఎంపిక చేసే అధ్యక్షునితోనే రాష్ట్రంలో అధికారం సాధిస్తామని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చట్టసభలకు ఎన్నికైన వారు సారథి అయితే..గెలుపు బాటలు వేయడానికి అవకాశం ఉంటుందని ... వారు భావిస్తున్నారు. దీటైన నేతకే చాన్స్ ఇవ్వాలని మరికొందరు పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News