Sustain Kart: సెలబ్రెటీలకు టోకరా.. తృతీయ జ్యూవెలరీ అధినేత అరెస్ట్

పెట్టుబడి పేరుతో సెలబ్రెటీలకు(Celebraties) టోకరా వేసిన తృతీయ జ్యూవెల్లరీ అధినేత కాంతి దత్(Kanthi Datt) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2024-12-01 08:02 GMT

దిశ, వెబ్ డెస్క్: పెట్టుబడి పేరుతో సెలబ్రెటీలకు(Celebraties) టోకరా వేసిన తృతీయ జ్యూవెల్లరీ అధినేత కాంతి దత్(Kanthi Datt) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సస్టెయిన్ కార్ట్(Sustain Kart) పేరుతో బాలీవుడ్(Bolly Wood) నుంచి టాలీవుడ్(Tolly Wood) వరకు సెలబ్రెటీలకు కుచ్చుటోపి పెట్టిన అతడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station) లో కేసు(Case) నమోదు అయ్యింది. పరిణితి చోప్రా(Parinithi Chopra) బ్రాండ్ అంబాసిడర్(Brand Ambasidor) గా ఉందంటూ.. తన కంపెనీలో పెట్టుబడి పెట్టాలని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి, తనని మోసం చేశాడని శ్రీజరెడ్డి అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అలాగే పరిణితి చోప్రాకు వ్యాపారంలో షేర్ అంటూ బాలివుడ్ హీరోయిన్ ను కూడా బురిడీ కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా దాదాపు 100 కోట్లకు పైగా మోసం చేసినట్లు కాంతి దత్ పై ఆరోపణలు ఉన్నాయి. పలువురు ప్రముఖుల సంతకాలు ఫోర్జరీ చేసి మోసం చేసినట్లు కూడా కాంతిదత్ పై అభియోగాలున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాంతి దత్ ను అరెస్ట్ చేశారు. ఇతని బాధితుల్లో హీరోయిన్ కీర్తి సురేష్, సమంత, డిజైనర్ శిల్పారెడ్డి కూడ ఉన్నారని తెలుస్తోంది. విచారణలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో కూడా ఇతనిపై సీసీఎస్ లో కేసులు నమోదు అయ్యాయి. 

Tags:    

Similar News