Harish Rao : గురుకులాల దీనస్థితి చూసి బాసర సరస్వతి తల్లడిల్లుతుంది : హరీష్ రావు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో గురుకులాల (Gurukuls)దీనస్థితి చూసి బాసర సరస్వతి(Basara Saraswati) తల్లి మనసు (Mother's Mind)తల్లడిల్లుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లో గురుకులాల (Gurukuls)దీనస్థితి చూసి బాసర సరస్వతి(Basara Saraswati) తల్లి మనసు (Mother's Mind)తల్లడిల్లుతుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు(Harish Rao)ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో “ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని తీసుకెళ్లండి” అని తల్లిదండ్రులను వేడుకుంటున్న విద్యార్థులు..ఇంకోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి అని..విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని విమర్శించారు.
ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారని.. ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా? కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బ్రతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని, ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేము ఉండలేము అని విద్యార్థులు వేడుకుంటున్నారని విమర్శించారు. కన్నబిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకపోతున్నారని, ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నీవే ఉండి భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నావని.. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి, విద్యార్థుల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.