Power Purchase: తెలంగాణ డిస్కంలకు మరో షాక్.. హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు మరోసారి సారి షాక్ తగిలింది.

Update: 2024-09-12 10:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు మరోసారి షాక్ తగిలింది. గురువారం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్ఛేంజీలు నిలిపివేశాయి. ఛత్తీస్‌గడ్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ.261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలను విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకున్నది. దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే కారణంగా విద్యుత్ కొనుగోలుకు బిడ్స్ వేయకుండా పవర్ ఎక్స్ఛేంజీలు అడ్డుకున్నాయని అధికార వర్గాల నుంచి పలు విమర్శలు వస్తున్నాయి. ఛత్తీస్‌గడ్ విద్యుత్తు కోసం పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌తో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కారిడార్లను బుక్ చేసుకున్నది. 1000 మెగావాట్లకు అదనంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్తు సరఫరాకు గత ప్రభుత్వం అడ్వాన్స్ కారిడార్ బుక్ చేసింది. దీంతో ఛత్తీస్‌గడ్ విద్యుత్తు లభించకపోవడంతో కారిడార్‌ను గత ప్రభుత్వం రద్దు చేసుకున్నది.

అయితే, విద్యుత్ వాడినా.. వాడకున్నా పరిహారం కింద రూ.261 కోట్లు కట్టాలని తెలంగాణ డిస్కంలకు (పీజీసీఐఎల్) నోటీసులు జారీ చేసింది. దీంతో తెలంగాణ డిస్కంలు సెంట్రల్​ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ని ఆశ్రయించింది. మరోవైపు ఈ వివాదం సీఈఆర్సీ పరిధిలో ఉండగానే తాజా నిర్ణయం తీసుకున్న పవర్​ గ్రిడ్ కార్పొరేషన్ నిర్ణయంపై హెక్టోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.


Similar News