రవాణాశాఖ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సురేంద్రమోహన్

రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌గా కె.సురేంద్రమోహన్ గురువారం స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-11-14 14:16 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌గా కె.సురేంద్రమోహన్ గురువారం స్టేట్ ట్రాన్స్ పోర్టు అథారిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్‌గా పనిచేసిన ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం మైన్స్ అండ్ జియాలజీ సెక్రటరీ గా ఉన్న ఆయనకు రవాణాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించడంతో బాధ్యతలు చేపట్టారు. ఆయనను టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్లెంల రవీంద్ర కుమార్, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. అదే విధంగా జేటీసీలు రమేష్, మమత, తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, డీటీసీలు, ఆర్టీఓలు, ఉద్యోగులు కలిశారు.


Similar News