SSA: సమగ్ర శిక్షా ఉద్యోగుల ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ తల్లి
గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు(SSA Employees) హైదరాబాద్‌లోని(Hyderabad) బషీర్ బాగ్(Basheer Bhag) లో భారీ ర్యాలీ చేపట్టారు.
దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు(SSA Employees) హైదరాబాద్‌లోని(Hyderabad) బషీర్ బాగ్(Basheer Bhag) లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఓ ఉద్యోగిని తెలంగాణ తల్లి గెటప్(Telangana Thalli Getup) వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో ఆవిష్కరించిన తెలంగాణ తల్లిలా ఆకుపచ్చ రంగు చీర, ఎరుపు రంగు రవికతో అదే కట్టు బొట్టు ధరించి, రెడీ అయ్యి ర్యాలీలో పాల్గొంది. ఈ నిరసనలో సమగ్ర శిక్షా ఉద్యోగులు ఈ తెలంగాణ తల్లిని ముందు నడిపించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయాలని, ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇక ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకొని, ఉద్యోగులను అరెస్ట్ చేశారు.