Harish Rao: ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? కాంగ్రెస్ సర్కార్ పై హరీశ్ రావు విమర్శలు
ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? కాంగ్రెస్ సర్కార్ పై హరీశ్ రావు విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఎకరాకు రూ.7,500 ఇస్తామని చెప్పి మాట తప్పిన కాంగ్రెస్ తీరును చూసి యావత్ తెలంగాణ రైతాంగం చీదిరించుకుంటున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రైతు భరోసా (Rythu Bharosa) పేరిట కాంగ్రెస్ చేసిన మోసంపై వరంగల్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను (Bhatti Vikramarka) మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను నిర్భంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎక్కడ రైతులు తిరగబడతారో అని.. మంత్రుల పర్యటనల్లో భారీగా పోలీసులను మోహరించి ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటామని ఎక్కడిక్కడ నిలదీస్తూనే ఉంటామన్నారు.