TPCC : 8వ తేదీన టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(PAC)ఈనెల 8వ తేదీన భేటీ కానుంది.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(PAC)ఈనెల 8వ తేదీన భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు గాంధీ భవన్ లో జరిగే టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కే.సీ వేణుగోపాల్(K.C. Venugopal) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ(Deepadas Munshi)అధ్యక్షతన జరగనున్న ఈ పీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షులు బీ. మహేష్ కుమార్ గౌడ్(B. Mahesh Kumar Goud), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti విక్రమార్కలు)లతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొంటారు.
రాష్రంలో ప్రస్తుత రాజకీయాలు.. కాంగ్రెస్ పార్టీ విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు, కుల గణన, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన నిర్ణయాలు వంటి అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం.