షాకింగ్ ఘటన.. జింక మాంసం పేరుతో కుక్క మాంసం విక్రయం

కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు.

Update: 2023-06-09 02:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేటుగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కుక్కను చంపి జింక మాంసం అంటూ విక్రయించడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. లక్ష్మణచందా గ్రామంలో ఓ పెంపుడు కుక్కను దొంగిలించి.. జింక మాంసం అంటూ దుండగులు విక్రయించారు. సీసీ టీవీలో కుక్క దొంగతనానికి సంబంధించిన వీడియో రికార్డు అయ్యింది. పోలీసులు ఎంక్వైరీ చేయడంతో అసలు నిజం బయటపడింది. కుక్కను దొంగిలించిన శ్రీనివాస్, వరుణ్ అనే వ్యక్తులను పోలీసులు విచారించారు. దీంతో జింక మాంసం పేరుతో కుక్క మాంసాన్ని విక్రయించామని నిందితులు ఒప్పుకున్నారు. దీంతో కుక్క మాంసం కొన్న వారితో పాటు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. 


Similar News