MLA Komatireddy: తెలంగాణ అసెంబ్లీ భవనం అక్కడుంటే బాగుంటుంది

తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-17 17:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు కొత్త అసెంబ్లీ భవనం అవసరం అని అన్నారు. ఇప్పుడున్న భవనం చాలా పాతదని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Secretariat) పక్కనున్న ఎన్టీఆర్‌ గార్డెన్‌(NTR Garden)లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే వ్యూ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ నిర్మాణానికి అవసరమైతే FTL పరిధిని కుంచించవచ్చని చెప్పారు. సచివాలయం, అసెంబ్లీ, అమరవీరులస్థూపం.. హుస్సేన్‌సాగర్‌(Hussain Sagar) ఒడ్డున చూడచక్కగా ఉంటాయని అన్నారు. సచివాలయం, అసెంబ్లీ పక్కపక్కనే ఉంటే పాలనపరంగా బాగుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News