కొత్త సంవత్సరం తర్వాత బీఆర్ఎస్‌కు హరీష్ రావు గుడ్ బై?.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్(BRS)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS)పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Beerla Ilaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2025లో కేటీఆర్(KTR) అరెస్ట్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కొత్త సంవత్సరం తర్వాత కేటీఆర్, హరీష్ రావు(Harish Rao)లకు సినిమా చూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. కొత్త సంవత్సరం తర్వాత హరీష్ రావు తప్పకుండా కొత్త దారి చూసుకుంటారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్‌పై బెయిల్ మీద బయట తిరుగుతున్న కవిత(Kavitha)కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని సీరియస్ అయ్యారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కథ క్లైమాక్స్‌కు వచ్చిందని తెలిపారు. అంతకుముందు.. ఐఎన్‌టీయూసీ క్యాలెండర్‌ను బీర్ల అయిలయ్య ఆవిష్కరించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్న ఐఎన్‌టీయూసీ కార్మికుల హక్కుల సాధనకు పోరాడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్యపాత్ర పోషించిందన్నారు.