Hydra: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన ప్రకటన
హైడ్రా(Hydra) కమిషనర్ రంగనాథ్(Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలాలను ఎక్కువగా సంపన్నులే ఆక్రమిస్తున్నారని అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(Hydra) కమిషనర్ రంగనాథ్(Ranganath) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలాలను ఎక్కువగా సంపన్నులే ఆక్రమిస్తున్నారని అన్నారు. శనివారం ఆయన బేగంపేటలో మీడియాలో మాట్లాడారు. ఇప్పటివరకు ఆక్రమణలకు గురైన స్థలాల్లో పేదల కంటే ఎక్కువగా ధనికులే ఉన్నారని తెలిపారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల వారు ఆక్రమణలకు పాల్పడ్డారని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. లోటస్‌పాండ్‌లో ఎకరం స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒకరు ప్రయత్నిస్తే హైడ్రా అడ్డుకుందని తెలిపారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోందని సంచలన ప్రకటన చేశారు. హైడ్రాకు వచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందని అన్నారు.