Seethakka: మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

ఏఐసీసీ అగ్రనేత సోనియా (AICC Leader Sonia Gandhi) జన్మదినం(Birthday) సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారిక నివాసం జ్యోతిబాపులే ప్రజా భవన్(Prajabhavan) లో జన్మదిన వేడుకలు(Celebrations) ఘనంగా నిర్వహించారు.

Update: 2024-12-09 05:22 GMT
Seethakka: మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏఐసీసీ అగ్రనేత సోనియా (AICC Leader Sonia Gandhi) జన్మదినం(Birthday) సందర్భంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అధికారిక నివాసం జ్యోతిబాపులే ప్రజా భవన్(Prajabhavan) లో జన్మదిన వేడుకలు(Celebrations) ఘనంగా నిర్వహించారు. మంత్రి సీతక్క సోనియా గాంధీ చిత్రపటం చేతబట్టి జై సోనియమ్మ అని నినాదాలు చేశారు. ఈ వేడుకలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ(Telangana) బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అని అన్నారు.

పార్టీకి నష్టం జరిగినా.. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన త్యాగశీలి సోనియాగాంధీ అని కొనియాడారు. తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. అలాగే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన(People Governance) కొనసాగుతోందని, సోనియా గాంధీ ఆదేశానుసారం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. అంతేగాక నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించామని, రైతన్నలను రుణ విముక్తులు చేశామని అన్నారు. ఇక సోనియాగాంధీ జన్మదినము తెలంగాణ ప్రజలకు పండగ రోజు అని, సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని సీతక్క అన్నారు.

Tags:    

Similar News