CM Revanth: సీఎం రేవంత్ క్లాస్ వర్కవుట్.. నేతల మధ్య కుదిరిన కో-ఆర్డినేషన్
సభలో సమన్వయంతో వ్యవహరించాలని, విపక్షాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన కౌన్సెలింగ్ వర్కవుట్ అయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సభలో సమన్వయంతో వ్యవహరించాలని, విపక్షాలను కలిసికట్టుగా ఎదుర్కోవాలంటూ ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన కౌన్సెలింగ్ వర్కవుట్ అయింది. గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌పై చేసిన కామెంట్స్ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ఒకేసారి రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల రన్నింగ్ కామెంట్స్‌కు కౌంటర్‌గా రంగంలోకి దిగారు. జగదీశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను చూసిన ఇతర పార్టీ సభ్యులు సీఎం ఇచ్చిన కౌన్సెలింగ్ కాంగ్రెస్ సభ్యుల్లో కొట్టొచ్చినట్టు కనిపించిందని లాబీల్లో మాట్లాడుకుంటూ కనిపించారు.
సీఎల్పీ మీటింగ్‌లో.. రేవంత్ కౌన్సెలింగ్
బుధవారం గవర్నర్ ప్రసంగం తర్వాత జరిగిన సీఎల్పీ మీటింగ్‌లో సీఎం రేవంత్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్లాస్ తీసుకున్నారు. సభలో కోఆర్డినేషన్‌తో పనిచేయాలని, విపక్షాలకు దీటుగా అన్సర్ ఇవ్వాలని, సభ్యులందరూ అన్ని సబ్జెక్ట్‌లపై స్డడీ చేయాలని కౌన్సెలింగ్ తీసుకున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే విపక్ష సభ్యులను కట్టడి చేసేందుకు వెంటనే రియాక్ట్ కావాలని సూచించారు. విప్‌ల పనితీరు సరిగా లేదని, ప్రభుత్వం కల్పిస్తోన్న సౌకర్యాలను అనుభవించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారే కానీ, విపక్షాల విమర్శలకు ప్రతివిమర్శలు చేయట్లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
తొలిసారి కనిపించిన ఐక్యత
కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 5 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గతంలో జరిగిన ఏ సమావేశంలో కూడా రూలింగ్ పార్టీలో ఫ్లోర్ కోఆర్డినేషన్ లేదని విమర్శలు వినిపించేవి. బీఆర్ఎస్ సభ్యుల రన్నింగ్ కామెంట్రీ, విసిరే సెటైర్లకు కౌంటర్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని కామెంట్స్ ఉండేవి. కానీ మొదటిసారి అసెంబ్లీలో గురువారం జరిగిన పరిణామాల్లో అధికార పార్టీ చాలా యాక్టివ్‌గా రియాక్ట్ అయింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి స్పీకర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ సభ్యులు ఒకేసారి రియాక్ట్ అవడం. స్పీకర్‌ను అవమానపరిచే విధంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారంటూ ఆందోళనకు దిగడం. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకేసారి లేచి నిలబడి.. కొందరు ‘జగదీశ్‌పై యాక్షన్ తీసుకోవాలి’ అని స్లోగన్స్ చేయగా, మరికొందరు ‘జగదీశ్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’ అంటూ డిమాండ్ చేశారు.
విప్‌ల ఉరుకులు పరుగులు
స్పీకర్‌పై జగదీశ్‌రెడ్డి చేసిన కామెంట్స్‌తో సభలో గందరగోళం నెలకొన్నది. దీనితో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేస్తున్నట్టు సభాపతి ప్రకటించారు. వెంటనే బీఆర్ఎస్ సభ్యులు మీడియా పాయింట్‌కు వెళ్లి ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వ విప్‌లు సభ నుంచి హడావుడిగా బయటికి వచ్చి, ఉరుకులు పరుగులు పెడుతూ.. బీఆర్ఎస్ సభ్యుల కంటే ముందే మీడియా పాయింట్‌కు వచ్చి.. ఆ పార్టీపై విమర్శలు చేశారు.
Read More..
LRS: అస్తవ్యస్తంగా LRS దరఖాస్తుల పరిష్కారం.. పట్టించుకోని సర్కార్