మే 5 నుంచి కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు టైనింగ్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు టైనింగ్ ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ శుక్రవారం ప్రకటనలో తెలిపారు....

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు టైనింగ్ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వ జాయింట్‌సెక్రటరీ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముస్సోరీ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)కి పదోన్నతి పొందిన అధికారులకు ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ (ఐటీపీ)ని నిర్వహించున్నారు. కన్ఫర్డ్ ఐఏఎస్‌లకు అఖిల భారత సేవలలో ఉత్తమ దృక్కోణాన్ని పెంపొందిచేందుకు ఈ టైనింగ్ దొహదపడనుంది. మే5వ తేదీ నుంచి జూన్13 వరకు ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన' ఈ శిక్షణలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్టం నుంచి ఎంపికైన 2015, 2016, 2018, 2019, 2021, 2022, 2020 బ్యాచ్‌కు చెందిన 22 మంది అధికారులో టైనింగ్ తీసుకొకున్నారు. శిక్షణకు హాజరయ్యే వారంతా మే 4న ముస్సోరీలోని లాల్ బహదూర్ హదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు. అలాగే ఇండక్షన్ శిక్షణకు నామినేట్ చేసిన అధికారులను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కన్ఫర్డ్ ఐఏఎస్‌లు వీరే..
కోర్ర లక్ష్మి (2015)
సీహెచ్శివ లింగయ్య(2016)
చిట్టెం లక్ష్మి(2016)
డి. అమోయ్‌కుమార్(2016)
ఎం. హనుమంతరావు(2016)
ఎం. హరిత(2016)
టి. వినయ్‌కృష్ణారెడ్డి(2016)
వి. వెంకటేశ్వర్లు(2016)
అయిషా మస్రత్‌ఖానమ్(2018)
జి. రవి (2018)
కె. నిఖిల(2018)
కె. స్నేహ( 2018)
ఎం. సత్యశారదాదేవి(2018)
నారాయణ రెడ్డి (2018)
ఎస్. హరీష్(2018)
ఎస్. సంగీత సత్యనారాయణ(2018)
ఎస్ . వెంకటరావు(2018)
ఎస్కె. యాస్మిన్‌బాషా (2018)
ఎ. నిర్మలకాంతి వెస్లీ(2019)
జల్దా అనసూరి(2021)
పి.కాత్యాయనిదేవి(2021)
జి. ఫణింద్రరెడ్డి(2022)
కె.చంద్రశేఖర్‌రెడ్డి(2023)