ఎవరైతే నాకేంటి.. బరితెగించిన ఇసుక వ్యాపారి

నా ఇష్టం వచ్చినట్టు ఇసుక తోలుతా.. అంటూ ఇసుక వ్యాపారి ట్రాక్టర్‌తో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా కాపు కాసి పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-03-22 02:15 GMT

దిశ, ఎల్లారెడ్డి : నా ఇష్టం వచ్చినట్టు ఇసుక తోలుతా.. అంటూ ఇసుక వ్యాపారి ట్రాక్టర్‌తో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా కాపు కాసి పోలీసులు పట్టుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన, మార్గం రాఘవేందర్ తన సొంత ట్రాక్టర్‌తో లక్ష్మాపూర్ అటవీ ప్రాంతం నుండి అక్రమంగా ఇసుక తరలిస్తూ విక్రయిస్తున్నాడు. పలుమార్లు అటవీశాఖ అధికారులు పలు అధికారులు ప్రత్యేక నిఘా పెట్టి కాపు కాసిన, ఎవరిని లెక్క చేయకుండా అందరిపై దుర్భాషలాడుతూ అక్రమంగా వారిపై చేయి చేసుకునేవాడని పరిసర ప్రాంత ప్రజలు మార్గం రాఘవేంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు పక్కా సమాచారం మేరకు అడవి లింగాల గేటు వద్ద కాపు కాసి పట్టుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పరిసర ప్రాంత ప్రజల ఫిర్యాదు మేరకు ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి ట్రాక్టర్‌ను పట్టుకొని ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న రాఘవేంద్ర పై కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా ఇసుకను తరలించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ మహేష్ తెలిపారు.


Similar News