యాదగిరి గుట్టలో శ్రీ మహాలక్ష్మిగా అమ్మవారు
యాదగిరి గుట్ట అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనమిచ్చారు.
దిశ, వెబ్ డెస్క్ : యాదగిరి గుట్ట అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారి దర్శనమిచ్చారు. భక్తులు శ్రీ మహాలక్ష్మి అవతార అలంకార సేవలో దుర్గమ్మను దర్శించుకుని పులకించారు. ప్రాతఃకాల పూజ, అర్చనలు, పారాయణములు, గాయత్రీ జపములు, లలిత సహస్రనామార్చన, మధ్యాహ్న పూజ నీరాజన మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి నవావరణ పూజ, సహస్రనామార్చన నీరాజనం మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. కుంకుమార్చనల్లో దంపతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. సోమవారం పురస్కరించుకుని శివాలయంలో శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.