Bhatti Vikramarka: ‘హైడ్రా’పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి సెన్సేషనల్ కామెంట్స్

కాంగ్రెస్ (Congress) పార్టీలో ఎవరికి వ్యక్తిగత అజెండాలు లేవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-07 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ (Congress) పార్టీలో ఎవరికి వ్యక్తిగత అజెండాలు లేవని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన (Moosi) సచివాలయం (Secretariat)లో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ (Hyderabad) అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అని అన్నారు. ‘హైడ్రా’ (HYDRA)పై తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్షాలు ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నాయని ఆక్షేపించారు. కేవలం ప్రజలకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి నగర పరిధిలో చాలా చెరువులు, పార్కులు, కబ్జాలకు గురయ్యాయని గుర్తు చేశారు. గతంలోనూ చెరువులను కాపాడటంతో పాటు మూసీ (Moosi) ప్రక్షాళనకు ప్రయత్నాలు జరిగాయని, కానీ కాలక్రమేణా ఆ పనులకు పలుమార్లు బ్రేకులు పడ్డాయని తెలిపారు. తమది ముమ్మాటికీ ప్రజా ప్రభుత్వమని.. పారదర్శక ప్రభుత్వమని భట్టి స్పష్టం చేశారు.

నగరం నడిబొడ్డున ఉన్న మూసీ (Moosi)ని మణిహారంగా మార్చలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ధ్యేయమని అన్నారు. ఈ విషయంలో ఎవరికి వ్యక్తిగత అజెండాలు లేవని తెలిపారు. శాటిలైట్ (Satellite) ఆధారిత సర్వేతో కబ్జాలపై పూర్తి సమాచారాన్ని ఇప్పటికే అధికారులు సేకరించారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఓ మంచి పనిపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని భట్టి విక్రమార్క ఆక్షేపించారు.


Similar News