‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట’.. మందకృష్ణ మాదిగపై రేవంత్ రెడ్డి ఫైర్

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలా? రద్దు చేయాలా? అనే దానికి రెఫరెండంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-25 07:34 GMT
‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట’.. మందకృష్ణ మాదిగపై రేవంత్ రెడ్డి ఫైర్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలా? రద్దు చేయాలా? అనే దానికి రెఫరెండంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పక్కన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం పెంచి కొనసాగించాలనే కాంగ్రెస్ పార్టీ, మరో వైపు ఆ రిజర్వేషన్లను రద్దు చేసి ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు పరిచాలని చూస్తున్న బీజేపీ ఉన్నాయని ఈ విషయంలో ప్రజలు విజ్ఞతతో నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో పదేళ్ల బీజేపీ పాలన వైఫల్యాలపై టీ కాంగ్రెస్ ప్రజాచార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంపై బీజేపీ చివరి యుద్ధం ప్రకటించిందని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు చేయడమే బీజేపీ ఆఖరి యుద్ధం అన్నారు. ఇది చేయాలంటే పార్లమెంట్ లో 400 ఎంపీ సీట్లు అవసర పడుతుందని అందుకోమే మోడీ మొండిగా వ్యవహరించైనా కాంగ్రెస్ పై విష ప్రచారం చేసి 400 సీట్లును సాధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని ధ్వజమెత్తారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి వందేళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఈ రిజర్వేషన్లను తొలగించబోతున్నారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ వారికి కొంత మంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వారు ఎలా మద్దతిస్తున్నారు ఉంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా మీరు తాత్కాలిక స్థానిక రాజకీయ లబ్ధి కోసం బీజేపీకి మద్దతిస్తే అది రిజర్వేషన్లు రద్దుకు దారి తీస్తుందన్నారు. మేము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఈ వర్గాలకు 50 శాతానికి పైబడి రిజర్వేషన్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ విధానం అన్నారు. ఈ విధానం సమర్ధించాలంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఈ రిజర్వేషన్లు వద్దు, రద్ధు చేయాలనుకునేవారు బీజేపీకి, ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ఏ వ్యవస్థను లెక్కపెట్టే వ్యక్తి కాదని 370 ఆర్టికల్ రద్దు, యూనిఫామ్ సివిల్ కోడ్, జీస్టీ, నోట్ల రద్దు చూశాం. వాళ్లు చేయాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడుతారన్నారు. మోడీ పాలనలో పదేళ్ల మోసం- వందేండ్ల విధ్వంసం జరిగిందని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News