Revanth: మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి దేవి మృతి.. సీఎం దిగ్భ్రాంతి

మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే(Former Metpalli MLA), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమిరెడ్డి జ్యోతి దేవి(Komireddy Jyoti Devi) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) దిగ్భ్రాంతి(Shock) వ్యక్తం చేశారు.

Update: 2024-11-09 14:19 GMT

దిశ, వెబ్ డెస్క్: మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే(Former Metpalli MLA), కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కొమిరెడ్డి జ్యోతి దేవి(Komireddy Jyoti Devi) మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) దిగ్భ్రాంతి(Shock) వ్యక్తం చేశారు. దివంగత మాజీ ఎమ్మెల్యే, అడ్వకేట్ కొమిరెడ్డి రాములు(Advocate Komireddy Ramulu) సతీమణి కొమిరెడ్డి జ్యోతి అనారోగ్యంతో బెంగళూరు(Bangalore)లోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మాజీ ఎమ్మెల్యే మృతిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఉగ్వేదబరిత వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. జ్యోతి దేవి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి(Deepest Condolences) తెలియజేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్న కొమిరెడ్డి జ్యోతి మెట్ పల్లి ప్రజలకు జ్యోతక్కగా సుపరిచితురాలు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన జ్యోతి దేవి.. మహిళా రిజర్వేషన్ కోసం చట్ట సభల్లో ఆందోళనలు చేశారు.

Tags:    

Similar News