TG Assembly: తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆంక్షలు? అక్కడ నిల్చోవద్దని కీలక ఆదేశాలు

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా తాాజాగా అసెంబ్లీ లాబీలో ఆంక్షలు అమలవుతున్నాయి.

Update: 2025-03-22 09:21 GMT
TG Assembly: తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆంక్షలు? అక్కడ నిల్చోవద్దని కీలక ఆదేశాలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసనసభ (Telangana Assembly) సమావేశాల్లో భాగంగా తాాజాగా అసెంబ్లీ లాబీలో ఆంక్షలు (Restrictions) అమలవుతున్నాయి. మంత్రుల చాంబర్ల ముందు నిల్చోవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రతీ మంత్రి ఛాంబర్ ముందు ప్రత్యేకంగా మార్షల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక లాబీ పాస్‌లు ఉన్నా జర్నలిస్ట్‌లకు లాబీకి ఎంట్రీ ఇవ్వడం లేదని తెలిసింది. దీంతో మంత్రుల చాంబర్ల ముందు మీడియా ఉండవద్దని ఓరల్ ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. కాగా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు మంత్రుల చాంబర్ల ముందు ఉంటున్నారని, ఆ సమయంలో అధికారులతో మంత్రులు చర్చలు, అసెంబ్లీలో మాట్లాడే విషయాలపై రాసుకోవడం చేస్తున్నారని, దీంతో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉండటంతో చాంబర్ల ముందు మిగతా జనంతో పాటు మీడియాను కూడా నిల్చో వద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా జర్నలిస్టులకు మాత్రమే కొంత మేరకు మాత్రమే అనుమతి ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News