వినియోగదారుల నుంచి రిక్వెస్టులు.. ‘గృహజ్యోతి’ కరెక్షన్‌కు చాన్స్

రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తోంది.

Update: 2024-07-11 16:18 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రజాపాలనలో భాగంగా వినియోగదారులు అందజేసిన యూఎస్‌సీ నంబర్ కు ఈ పథకాన్ని వర్తింపజేసి జీరో బిల్లులు అందిస్తోంది. అయితే ఈ పథక లబ్ధిదారులు ఇల్లు మారినపుడు, ఆహారభద్రత కార్డు, సర్వీస్ కనెక్షన్ అనుసంధానం లోపాల వల్ల గృహజ్యోతి పథకాన్ని పొందలేకపోతున్నారు. ఈ విషయంపై పలు వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రజా పాలన సేవ కేంద్రాల్లో యూఎస్‌సీ నంబర్ ను సరిచేసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ నల్లగొండ రూరల్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం లో ఉన్న ప్రజాసేవా కేంద్రాన్ని సందర్శించి గృహజ్యోతి పథకం లబ్ధిదారుల నమోదు విధానాన్ని పరిశీలించారు.


Similar News