మూడోరోజు కొనసాగుతున్న అమోయ్ కుమార్ ఈడీ విచారణ

రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్(Amoy Kumar) ఈడీ(ED) విచారణ మూడోరోజు కొనసాగుతోంది.

Update: 2024-10-25 10:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్(Amoy Kumar) ఈడీ(ED) విచారణ మూడోరోజు కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న అమోయ్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు గతంలో కలెక్టర్ గా పని చేసిన సమయంలో విలువైన ప్రభుత్వ భూములతోపాటు, భూదాన్ భూములను గత ప్రభుత్వ నాయకులను అడ్డం పెట్టుకొని అతి తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని అమోయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆయా జిల్లాలలోని రైతులను బెదిరించి వారి భూములను బలవంతంగా లాక్కున్నారని పలువురు రైతులు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈడీ రంగంలోకి దిగి విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. గత రెండు రోజులుగా ఉదయం నుండి సాయంత్రం వరకు సుదీర్ఘ విచారణ జరిపి అమోయ్ వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. ఈ క్రమంలోనే నేడు కూడా అమోయ్ నుండి మరింత సమాచారం రాబడుతున్నట్టు సమాచారం. కాగా అమోయ్ కుమార్ మీద మరో కేసు నమోదైంది. అధికారం అడ్డం పెట్టుకొని 840 మందిని బెదిరించి వెయ్యి కోట్ల విలువైన భూములను అమోయ్ మాయం చేశాడని, రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం గ్రామంలోని మధురానగర్ కాలనీ ఫ్లాట్స్ వనర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.   

Tags:    

Similar News