ED: ఐఏఎస్ అమోయ్ కుమార్‌పై మరో ఫిర్యాదు.. 840 మందిని మోసం చేశారని ఆరోపణలు

ఐఏఎస్ అమోయ్ కుమార్ పై మరో ఫిర్యాదు నమోదు అయ్యింది.

Update: 2024-10-25 09:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఐఏఎస్ అమోయ్ కుమార్ పై మరో ఫిర్యాదు నమోదు అయ్యింది. కోట్ల విలువ చేసే భూమిని మాయం చేశారని మధురానగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. భూ కేటాయింపుల్లో అవినీతి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయనపై మరికొందరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వర్తించిన సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని 840 మందిని మోసం చేశారని రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం గ్రామంలోని మధురానగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దాదాపు వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని అమోయ్ కుమార్ మాయం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల కలెక్టర్‌గా పని చేసిన అమోయ్ కుమార్ భూకేటాయింపుల్లో అవకతవకలు జరిపారని పలు ఫిర్యాదులు రావడంతో ఈడీ నోటీసులు జారీ చేసి, విచారిస్తోంది.


Similar News