Anirudh Reddy: వ్యర్థాలను వదిలితే ఫార్మా కంపెనీలను తగలబెడుతా: అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫార్మా కంపెనీ (Pharma Industries)లు వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలితే.. తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-25 09:54 GMT

దిశ, జడ్చర్ల: ఫార్మా కంపెనీ (Pharma Industries)లు వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలితే.. తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (MLA Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రైతాంగం ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ క్రమంలో రైతుల పొలాల్లోకి ఫార్మా కంపెనీ (Pharma Industries)లు వ్యర్థాలను వదిలితే.. ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మనిషికి అన్నం పెట్టే రైతుల భూములు నాశనం చేసిన రూ.కోట్లు సంపాదిస్తారాని ఆయన పారిశ్రామికవేత్తలపై ఫైర్ అయ్యారు. త్వరలోనే కాలుష్య కారక పరిశ్రమలపై త్వరలోనే ఆయన స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌ (Speaker Prasad Kumar)కు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు.

కాగా, ఇటీవలే తిరుమల (Tirumala) వెళ్లిన అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి (Tirupathi) దేవస్థానానికి తెలంగాణ ఎమ్మెల్యే (Telangana MLA's)ల సిఫార్సు లేఖలతో వచ్చిన వారిని దర్శనానికి అనుమతించకపోవడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు.. తెలంగాణ, ఏపీ తనకు రెండు కళ్లలాంటివని చెప్పారని, ఇక్కడ మాత్రం తెలంగాణ (Telangana) నుంచి సిఫార్సు లేఖలపై వచ్చిన వారిని అనుమతించడం లేదని వాపోయారు. తెలంగాణలో యాదాద్రి (Yadadri), భద్రాచలం (Bhadrachalam) దేవస్థానాలకు వచ్చే భక్తులకు ఆంధ్రా నాయకులు ఇచ్చే సిఫార్సు లేఖలను తాము అనుమతించి దర్శనాలు కల్పిస్తున్నామని గుర్తు చేశారు. కానీ తమ సొంత మనుషులు, పార్టీ కార్యకర్తలు తిరుమలకు వస్తే కనీసం రూంలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఏపీ వాళ్లను తెలంగాణ (Telangana) ఎమ్మెల్యేలంతా కలిసి రాష్ట్రానికి రానివ్వొద్దని తీర్మానం చేస్తే.. ఆ బాధ ఏంటో వారికి కూడా అర్థం అవుతుందని ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనురుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News