KTR: కాంగ్రెస్ నేతల మాటలకు భయపడేది లేదు.. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

తాము ఒరిజినల్ బాంబులకే భయపడలేదని, అలాంటిది కాంగ్రెస్ నేతల ప్రకటనకు బెదరుతామా అని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Update: 2024-10-25 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: తాము ఒరిజినల్ బాంబులకే భయపడలేదని, అలాంటిది కాంగ్రెస్ నేతల ప్రకటనకు బెదరుతామా అని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో త్వరలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఇటీవలే మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారని, ఆయనే అరెస్ట్ కాబోతున్నారేమోనని కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి అమృత్ స్కామ్‌లో భాగంగా వాళ్ల బావమరిదికి కేంద్ర ప్రభుత్వం నంచి వచ్చిన నిధులు రూ.1,137 వేల కోట్లు అప్పనంగా రాసిచ్చినందుకు ఆయననే అరెస్ట్ చేస్తారేమో అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ఒక్కటేనని.. అందుకే బీజేపీ నేతలెవరూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) గురించి మాట్లాడటం లేదని ఆయన కామెంట్ చేశారు. మంత్రి పొంగులేటి దేని గురించి మాట్లాడుతున్నారని తెలియదని.. రాష్ట్ర కాంగ్రెస్‌ (State Congress)కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) రక్షణ కవచంలా పని చేస్తుందనే విషయం పక్కా అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలది అక్రమ సంబంధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారని.. ఇక నుంచి అలా మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులను ఎదిరించి పోరాటం చేశారని.. నేడు ఈ కాంగ్రెస్ నాయకులు తమకు లెక్క కాదని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని సవాల్ విసిరారు. ఆరు గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరాటం ఆగదని కేటీఆర్ (KTR) మరోసారి స్పష్టం చేశారు.

Tags:    

Similar News