రాజీనామా ప్రకటనకు ముందే.. BRS ఆఫీసులో కడియం ఫొటోలు తొలగింపు

బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై పార్టీ అధిష్టానంతో పాటు క్షేత్రస్థాయి లీడర్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు.

Update: 2024-03-29 06:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై పార్టీ అధిష్టానంతో పాటు క్షేత్రస్థాయి లీడర్లు కూడా ఆగ్రహంగా ఉన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ అధ్యక్షుడు దాస్యం వినయ్‌ భాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. అయితే, సమావేశానికి ముందే కడియం శ్రీహరి పార్టీ మార్పు నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన ఫొటోలు తొలగించారు. అయితే, పార్టీ మారడం ఖాయమని ఇంకా కడియం అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.

గురువారం రాత్రి వరంగల్ లోక్‌సభ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన కూతురు కడియం కావ్య ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు, భూ కబ్జాలు వంటివి పార్టీ ప్రతిష్టను దెబ్బ తీశాయని.. పరిణామాలతో జిల్లాలో లీడర్లలో కూడా సమన్వయం లోపించింది. ఈ క్రమంలోనే తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే, కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్‌లో చేరిక ఖరారు అయ్యాకే, బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చారని గులాబీ శ్రేణులు సీరియస్ అవుతున్నారు.

Tags:    

Similar News