మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తాం : తాండూర్ ఎమ్మెల్యే

వికారాబాద్ జిల్లాలో కోట్ పల్లి మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టులో

Update: 2024-10-19 13:06 GMT

దిశ, కోట్ పల్లి : వికారాబాద్ జిల్లాలో కోట్ పల్లి మండల పరిధిలోని కోట్ పల్లి ప్రాజెక్టులో శనివారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి 3 లక్షల చేప పిల్లలను వదిలాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తాం అని అన్నారు. చేపల పెంపకంతో ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రజలకు ఉపాధి లభిస్తుందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకరమైన అందిస్తామని ఆయన అన్నారు.. అనంతరం కోట్ పల్లి మత్స్యకారులు పలు సమస్యలతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళుతూ చెరువు కట్ట ధ్వంసం అయ్యిందని, చెరువు సమీపంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని, చేపలు పట్టడానికి బుట్టలు అవసరమని ఎమ్మెల్యే తో తెలిపారు.

మత్స్యకారుల సమస్యలను సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మత్స్యకారులకు అవసరమైన బుట్టలను సొంత డబ్బు ద్వారా ఇప్పిస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు అగ్గనూర్ శ్రీధర్, కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య,వైస్ చైర్మన్ నారయణ రెడ్డి, కోట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్ నాయక్,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి, మాజీ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు రవిరాల ఆనంద్,సీనియర్ నాయకులు నక్కల బందయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News