సంక్రాంతి తర్వాత రైతు భరోసా అందిస్తాం.. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు..

సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.

Update: 2025-01-06 09:25 GMT

దిశ, చేవెళ్ల : సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో జిల్లా సహకార సంఘం ఆధ్వర్యంలో 75 లక్షలతో ఏర్పాటు చెసిన గోదాము, దుకాణాల సముదాయాన్ని సోమవారం సహకార సంఘం జిల్లా చైర్మన్ పట్టొళ్ల కృష్ణ రెడ్డి అధ్యక్షతన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య లు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతులందరికీ రైతు భరోసా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జి భీం భరత్, గ్రంధాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ బోర్డు మెంబర్ సత్యనారాయణ రెడ్డి, ఆగిరెడ్డి దేవర వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సున్నపు వసంతం, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, మద్దెల శ్రీనివాస్, పెద్దోళ్ల ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.


Similar News