పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తాం
కుల్కచర్ల మండలం బండవెల్కి చెర్ల గ్రామ పరిధిలో గల పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామిని ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
దిశ, కుల్కచర్ల : కుల్కచర్ల మండలం బండవెల్కి చెర్ల గ్రామ పరిధిలో గల పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామిని ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క,తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాంబండ ఆలయ నూతన పాలకవర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నారు. స్థానిక నాయకులు గజమాలతో వారిని సన్మానించారు.