భూములు ఇచ్చిన రైతులకు.. వచ్చేవారం నుంచి ఇళ్ల స్థలాలు

కొడంగల్ మండలం, అప్పాయిపల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 19లో ప్రభుత్వ మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2024-12-15 05:04 GMT

దిశ, బొంరాస్ పేట్: కొడంగల్ మండలం, అప్పాయిపల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 19లో ప్రభుత్వ మెడికల్ కళాశాల, వెటర్నరీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా ఈ కళాశాలల ఏర్పాటుకు తమ భూములను స్వచ్చందంగా ఇచ్చిన రైతులకు డీటీసీపీ లేఔట్‌లో ఒక ఎకరానికి 125 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రిజిస్ట్రేషన్‌లు చేసి.. తమ భూములు ఇచ్చిన వారికి వచ్చే వారం నుంచి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ ప్రతిక్ జైన్ ఒక ప్రకటన‌లో తెలిపారు.


Similar News