రాజీ మార్గమే రాజా మార్గం

రాజీ మార్గమే రాజా మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శశిధర్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-14 16:50 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాజీ మార్గమే రాజా మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శశిధర్ రెడ్డి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో గల అన్ని కోర్ట్ ప్రాంగణాలలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... ఈ జాతీయ లోకాదాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లోకదాలత్ లో సెటిల్ చేసుకోవడం ద్వారా తాము సివిల్ కేసులలో చెల్లించిన కోర్ట్ ఫీస్ కూడా తిరిగి పొందొచ్చు అని చెప్పారు. తమ కేసులను, ఆస్తి పరమైన కేసులు, కుటుంబ సమస్యల కేసులు పరిష్కారం చేసుకోవడానికి ఈ లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం ఒక మంచి వేదిక అని చెప్పారు.

లోక్ అదాలత్ లో కేసు రాజీ అవ్వడం ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్టే అని అన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండాలి అని ఆశించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్ట్ ప్రాంగణాలలో 30 లోక్ అదాలత్ బెంచిలు ఏర్పాటు చేశామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.శ్రీదేవి అన్నారు. రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్ కేసులు ,సివిల్ దావాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, కన్జ్యూమర్ కోర్టు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించుకొన్నారు అని చెప్పారు. ఈ లోక్ అదాలత్ నిర్వహించుటలో పోలీస్ వారు, ఇన్సూరెన్స్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పానెల్ అడ్వొకేట్స్ డిలీఎస్ఏ సిబ్బంది తమ వంతు సహాయ సహకారాలను అందించారు. కక్షిదారులు సంతోషం వ్యక్త పరిచారు.


Similar News