‘పచ్చని పంట పొలాల్లో పొల్యూషన్ చిమ్మే ఫార్మా కంపెనీలు వద్దు..

దుద్యాల మండలంలోని పోలేపల్లి రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి

Update: 2024-10-09 09:32 GMT

దిశ,బొంరాస్ పేట్ :దుద్యాల మండలంలోని పోలేపల్లి రేణుక ఎల్లమ్మ ఆలయం నుండి దుద్యాల మండల కేంద్రం వరకు మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు వస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలను మార్గమధ్యంలో పాదయాత్రకు రాకుండా, బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల దగ్గర పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి,పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,పచ్చని పంట పొలాల్లో విషం చిమ్మే, పొల్యూషన్ వచ్చే,ఫార్మా కంపెనీల ఏర్పాటు చేసి,రైతుల నోట్లో మట్టి కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు.ఫార్మా కంపెనీలు కాకుండా,ప్రజలకు ఉపయోగపడే టెక్స్ టైల్స్, ఉపాధికి సంబంధించిన వాటిని తీసుకొచ్చి,ప్రజలకు మేలు చే యాలి చేయాలన్నారు.

రైతుల కోరిక మేరకు,రైతుల తరఫున పాదయాత్ర చేయడానికి వస్తున్న మమ్మల్ని,నాయకులను అరెస్ట్ చేయడం హేయామైనా చర్య అన్నారు.భూములు కోల్పోయే రైతులు శాంతియుతంగా, పాదయాత్ర చేయకుండా అడ్డుకోవడంమేమిటాని ప్రశ్నించారు.ఫార్మా కంపెనీ రద్దు చేసే వరకు,రైతుల తరఫున పోరాటం విరమించే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్నారు.పోలేపల్లి రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి రైతులు,ప్రజలు,నాయకులు పెద్ద ఎత్తున పోలేపల్లి-హకీంపేట కూడలి వరకు ర్యాలీ నిర్వహించి,గో బ్యాక్ ఫార్మా అంటూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ,ధర్నా నిర్వహించారు.రైతులను, పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో,కొద్దిసేపు తోపులాటతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ సందర్భంగా పలువురు రైతులు,మహిళలు మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని రేవంత్ రెడ్డిని గెలిపిస్తే,మా భూములను లాక్కొని,ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే,మేము ఎలా బ్రతకాలని వాపోయారు.

చావడానికైనా సిద్ధం కానీ,మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు.ఆనాడు ఇందిరమ్మ మాకు భూములు ఇస్తే,నేటి ఈ ప్రభుత్వం ఆ భూములను లాక్కోవడమేమిటాని ప్రశ్నించారు.అనంతరం రైతుల ధర్నా దగ్గరకొచ్చిన,దుద్యాల తాసిల్దార్ వెంకటేశ్ ప్రసాద్ కు రైతులు,నాయకులు,ఫార్మా కంపెనీలు ఏర్పాటు వద్దంటూ, వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు,ప్రజలు,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి, నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య,మహబూబ్నగర్ డీఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో,5 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు,పోలీస్ సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు నిర్వహించారు.

Similar News