ప్రపంచానికే ఆదర్శంగా భారత రాజ్యాంగం.. తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్

రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధించడమే రాజ్యాంగం సిద్ధాంతమని పెద్దేముల్ మండల తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్ అన్నారు.

Update: 2024-11-27 02:54 GMT

దిశ, పెద్దేముల్ : రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధించడమే రాజ్యాంగం సిద్ధాంతమని పెద్దేముల్ మండల తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని గోట్లపల్లి గ్రామంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందికి గ్రామ ప్రజలకు భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తెలంగాణ మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికే భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన భారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోదించబడి భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో దేశంలోని పౌరులందరికీ కుల, మత, ప్రాంత, పేద, ధనిక, బేధాలు లేకుండా సమాన న్యాయం కల్పించే హక్కును, ప్రసాదించిన రాజ్యాంగం ఆమోదించిన రోజును భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నమని గుర్తు చేశారు. కావున పౌరులందరూ భారత రాజ్యాంగ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో పరిశుభ్రతను పాటిస్తూ ఆదర్శ గ్రామంగా నిలిచేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోట్లపల్లి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గాయత్రి, గొట్లపల్లి పంచాయతీ కార్యదర్శి పరమేష్, ఆశ, అంగన్వాడి, ఉపాధి సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Similar News