ఎంపీ సారు.. మా జిల్లాను కూడా చూడండి సారు..

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి మేము కూడా ఓట్లు వేస్తేనే గెలిచారు, కానీ తనకి అధికంగా లీడ్ ఇచ్చిందనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి మాత్రమే నిధులు కేటాయిస్తూ మా జిల్లాలోని మూడు నియోజకవర్గాలను గాలికి వదిలేసాడని జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2023-03-03 16:17 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డికి మేము కూడా ఓట్లు వేస్తేనే గెలిచారు, కానీ తనకి అధికంగా లీడ్ ఇచ్చిందనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి మాత్రమే నిధులు కేటాయిస్తూ మా జిల్లాలోని మూడు నియోజకవర్గాలను గాలికి వదిలేసాడని జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అయిన కొత్తలో కొంత హడావుడి చెసిన ఎంపీ సారూ, కేంద్రంతో కొట్లాడి ఎంపీ నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలం అయ్యాడని, ఒకవేళ ఆర కొరా తెచ్చిన వాటిని తనకు ఎంతో ఇష్టం అయిన రాజేంద్రనగర్ లాంటి నియోజకవర్గాలకు మాత్రమే మళ్లిస్తూ జిల్లాపై ఎంపీ సవితి ప్రేమ చూపిస్తున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కష్టాల్లో ఉన్న పెద్దవాళ్ళను తన సొంత నిధులతో ఆడుకుంటూ ప్రశంసలు అందుకుంటున్న ఎంపీ, జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూర్ నియోజకవర్గాల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోవడంలేదని వారి వాదన.

దళిత ఎమ్మెల్యే అని చిన్నచూపా..?

జిల్లాలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నా ఎంపీ రంజిత్ రెడ్డి మాత్రం ఏవేవి నా పరిధిలోకి రావని, స్థానిక ఎమ్మెల్యేలే చూసుకుంటారులే అన్నట్లుగా నిర్లక్ష్యం వహిస్తుంటే, సీఎం కేసీఆర్ కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నాడని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. జిల్లాలోని తాండూర్, పరిగి, కొండంగల్ నియోజకవర్గాలకు అరకొర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాహిస్తున్న, వికారాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు ఇవ్వడంలో మాత్రం సీఎం కేసీఆర్ చవితి ప్రేమ చూపిస్తున్నాడని వాదిస్తున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దళిత ఎమ్మెల్యే అని చిన్నచూపో లేక మారె ఇతర కారణమో తెలియదు కానీ, 4 ఏళ్ళు గడుస్తున్నా వికారాబాద్ కు మాత్రం ప్రత్యేక నిధులు ఇవ్వడానికి సీఎంకు చేతులు రావడం లేదు అంటున్నారు.

గ్రామపంచాయతీలకు నిధులురాక అభివృద్ధి ఆగిపోయింది : బీఎస్పీ నాయకులు పెద్ది అంజయ్య

గ్రామా పంచాయితీలను అద్దాలల తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తున్నాం అని గొప్పలు చెబుతున్న కేసీఆర్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని కుంటు పడేసింది. దాదాపు పది నెలలుగా గ్రామ పంచాయితీలకు రావాల్సిన నిధులు రాక అభివృద్ధి మొత్తం ఆగిపోయిన పరిస్థితి. పనిచేసే కార్మికులకు కూడా జీతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కరెంటు బిల్లుల చెల్లింపు, గ్రామ పంచాయితీ టాక్టర్ల ఈఎంఐ ల చెల్లింపు తదితర వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిధులు లేక గ్రామాల ప్రజలు సర్పంచులు ఇంత ఇబ్బందులు పడుతుంటే ఒక ఎంపీగా రంజిత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం పెద్దలతో మాట్లాడి సమస్య పరిష్కరించలేకపోతే అయన ఎంపీగా గెలిచి ప్రయోజనం ఏంటని బీఎస్పీ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జి పెద్ద అంజయ్య ఎంపీ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    

Similar News