ఫర్టిలైజర్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు..

షాద్ నగర్ నియోజకవర్గంలో పలు ఫెర్టిలైజర్ షాపుల్లో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

Update: 2023-05-19 13:10 GMT
ఫర్టిలైజర్ దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు..
  • whatsapp icon

దిశ, షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గంలో పలు ఫెర్టిలైజర్ షాపుల్లో పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఫరూఖ్ నగర్ మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల, క్రిమిసంహారక మందులు తయారీ షాపులను, సోలిపుర్ పరిధిలోని విత్తన తయారీ కేంద్రాలను ఫరూఖ్ నగర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నిషాంత్ కుమార్, షాద్ నగర్ సీఐ నవీన్ కుమార్ లు తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనేటప్పుడు నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన వాటిని గుర్తించి నాణ్యమైన విత్తనాలు కొనాలని, నకిలీ విత్తనాలు ఉపయోగించవద్దు అని సూచించారు. నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలను అమ్మితే పీడీ యాక్టు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ నవీన్ కుమార్ తెలిపారు.

Tags:    

Similar News