కంచలేని ట్రాన్స్ పార్మర్లు.. ప్రమాదంలో ప్రజలు..

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో,ట్రాన్స్ పార్మర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి.

Update: 2024-10-20 09:35 GMT

దిశ, బొంరాస్ పేట్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో,ట్రాన్స్ పార్మర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. బొంరాస్ పేట్ మండల పరిధిలోని మదన్ పల్లి తండా, పలు గ్రామాల్లో ప్రధాన రోడ్డుకు పక్కన ఉన్న ట్రాన్స్ పార్మర్ లకు రక్షణకంచే ఏర్పాటు చేయలేదు. ఈ రోడ్డు పై నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు పక్కనే ఉండటంతో చిన్నపిల్లలు ఆటలాడుతుంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

బొంరాస్ పేట్ భూలక్ష్మి చౌరస్తాలో...

బొంరాస్ పేట్ మండల కేంద్రంలోని భూలక్ష్మి చౌరస్తాలో ప్రధాన రోడ్డుకు ప్రక్కన ట్రాన్స్ పార్మర్ ఉన్నది. ట్రాన్స్ పార్మర్ చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయలేదు. ప్రధాన కూడలి కావడంతో, నిత్యం మండల కేంద్రానికి వందలాది మంది ప్రజలు, పాఠశాలాలకు విద్యార్థులు వస్తుంటారు. ట్రాన్స్ పార్మర్ చుట్టూ, చెట్లు, మొక్కలు ఉండటంతో, కొన్ని రోజుల క్రితం రెండు మేకలు మేత మేస్తుండగా కంచె లేకపోవడంతో ట్రాన్స్ పార్మర్ తగిలి మృత్యువాత పడ్డాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కంచలేని ట్రాన్స్ పార్మర్ల చుట్టూ రక్షణ కంచే ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News