సీతాఫలం మార్కెట్‌కు సొంత స్థలం కరువు..
ఎందరో రైతులకు ఉపాధి బాట చూపిన సీతాఫలం మార్కెట్
దిశ, యాచారం : ఎందరో రైతులకు ఉపాధి బాట చూపిన సీతాఫలం మార్కెట్ కి గత చరిత్ర ఘనంగా ఉన్న నేడు దయానియా స్థితికి చేరుకుంది. వివరాల్లోకి వెళితే యాచారం మండల కేంద్రంలో అనేక ఏళ్లుగా సీతాఫలం క్రియ విక్రయాలు జోరుగా కొనసాగుతూ ఉండటం తో ఆనవాయితీగా వస్తున్న గ్రామ పంచాయతీ నిర్వహించే టెండర్ను చేజిక్కించుకోవడానికి వ్యాపారులు ఉత్సాహం చూపేవారు. గ్రామపంచాయతీకి ప్రతి ఏడురూ.50 వేల నుండి లక్ష వరకు ఆదాయం సమకూరేది. ఆదాయ వనరుగా మార్కెట్ నిలిచేది కానీ పాలకులు అధికారులు పట్టించుకోకపోవడంతో నేడు ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులు అయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో క్రియ విక్రయాలు జరిగేవి. బస్టాండ్ రీఓపెనింగ్ తో సాగర్ రహదారిపై సీతాఫలం క్రియ విక్రయాలు నిర్వహిస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రైతులు నగర బాట పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి సీతాఫలం మార్కెట్ కు సొంత స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
రైతుల కష్టాలను గుర్తించి సీతాఫలం మార్కెట్ కు స్థలం కేటాయించాలి : యాచారం గ్రామస్తుడు మహమ్మద్ సాజిద్.
సీతాఫలం మార్కెట్ కు సొంత స్థలం లేకపోవడంతో సాగర్ రోడ్డుపై క్రియ విక్రయాలు జరుపుతుండడం తో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అధికారులు స్పందించి సంతకు స్థలం కేటాయించాలని కోరుతున్నాం