పరిగిలో దొంగల హల్ చల్
పరిగిలో దొంగలు పోలీసుకుల సవాల్ విసురుతున్నారు. సీసీ కెమెరాలు ఉంటే మమ్మల్ని ఏం చేస్తాయి అంటూ ఏకంగా సీసీ ఫుటేజ్ రికార్డు అయిన డీవీఆర్ కూడా ఎత్తుకెళ్లి పోలీసులను సైతం ఆలోచనలో పడవేశారు.
దిశ, పరిగి : పరిగిలో దొంగలు పోలీసుకుల సవాల్ విసురుతున్నారు. సీసీ కెమెరాలు ఉంటే మమ్మల్ని ఏం చేస్తాయి అంటూ ఏకంగా సీసీ ఫుటేజ్ రికార్డు అయిన డీవీఆర్ కూడా ఎత్తుకెళ్లి పోలీసులను సైతం ఆలోచనలో పడవేశారు. పరిగి కొడంగల్ చౌరస్తాలోని సమీపంలోని బాలాజీ పెయింట్స్ అండ్ ఎలక్ట్రికల్ దుకాణానికి కన్నం వేశారు. దుకాణం వెనకాల నుంచి రేకుల షెడ్డు ను పగలగొట్టి దుకాణంలోకి చొరబడ్డారు. దుకాణంలోని సీసీ కెమెరాలను పక్కకు వంచి దుకాణంలోని 8 గ్రాముల గోల్డ్ కాయిన్, మరో నాలుగు గ్రాముల బంగారు కాయిన్స్, నగదు ఎత్తుకు వెళ్లారు. ఈ విషయం పై దుకాణ యజమాని సోను పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి దుకాణం పరిశీలించి వెళ్లారు. ఫిర్యాదు ఇచ్చిన కనీసం కేసు నమోదు చేయలేదంటూ దుకాణ యజమాని సోను తో పాటు తోటి మార్వాడీలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.