Collector : ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

Update: 2024-09-23 14:21 GMT

దిశ ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలో ప్రజావాణి ద్వారా వచ్చే దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం హాల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డిఓ వాసు చంద్రలతో కలిసి ప్రజల నుండి 179 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా అధికారులు పనిచేయాలన్నారు. రైతు రుణమాఫీ, భూమి సమస్యలు అధికంగా వస్తున్న క్రమంలో మండల స్థాయిలో పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. రుణ మాఫీపై వస్తున్న ఫిర్యాదుల పట్ల వ్యవసాయ అధికారులు పరిశీలించి రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకొని సమస్య పరిష్కార దిశగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్, ఆర్డిఓ వాసుచంద్ర, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News