మహేశ్వరం నియోజకవర్గంపై ప్రత్యేక నిఘా పెట్టిన ప్రభుత్వం

రాష్ట్రంలో మరో మహానగరం ఏర్పాటు చేయాల ని ప్రభుత్వం భావిస్తోంది.

Update: 2024-07-02 02:12 GMT

దిశ, రంగారెడ్డి బ్యూరో: రాష్ట్రంలో మరో మహానగరం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే నగర శివారు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నగరానికి అతి సమీపంలోనున్న ప్రాం తంతో పాటు కంపెనీ పెట్టుబడులు పె ట్టేందుకు అనువైన స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నట్లు సమాచా రం. అయితే మహేశ్వరం నియోజకవర్గంలో14వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 12వేల ఎకరాల భూమిలో ఎలాంటి వివాదాలు లేవు. కేవలం 2వేల ఎకరాల్లోనే భూ వివాదాలు కొనసాగుతున్న ట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రం లో పెట్టుబడి పెట్టేందుకు విదేశీ వ్యా పారులు భారీగా ప్రభుత్వంతో ఒప్పం దం చేసుకుంటున్నారు. ఈ వ్యాపారులకు ఎలాంటి సమస్యలు లేని ప్రాం తాలను అప్పగించాలని రాష్ట్ర ప్రభు త్వం యోచిస్తోంది. త్వరలో 1000 ఎకరాల్లో అతి భారీ స్ధాయిలో కంపెనీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన జరగనున్న ట్లు తెలుస్తోంది.

కాలుష్య రహిత కంపెనీలకే ప్రాధాన్యం..

గత ప్రభుత్వం మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల భూములను ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూ సేక రణ చేసింది. అయితే ఈ ఫార్మా కంపెనీలతో స్థానిక ప్రజలకు అనారోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకే ప్రస్తుత ప్రభుత్వం ఫార్మా కంపెనీకి కేటాయించిన భూ ముల్లో కేవలం కాలుష్య రహిత కంపె నీలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇప్పటికే వివిధ ఫార్మా కంపెనీలకు కేటాయించిన భూముల్లో కేవలం డ్రగ్స్​ నిల్వ చేసుకునేందుకు గోదాములను మాత్రమే నిర్మించాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తోంది. కానీ ఫార్మా కంపెనీతో ఎలాంటి రసాయనాల తయారీ చేయకూడదని వివరించినట్లు సమాచారం. భూ సేకరణలో భూమి కోల్పోయిన రైతులకు కాంగ్రెస్​ ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన గ్రామాల రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టింది. గత ప్రభు త్వం కేవలం సాగులోనున్న భూరైతులకు మాత్రమే నష్టపరిహారం కల్పించింది. ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వం సాగులో లేని భూ రైతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిరుపేదలైతే తప్పకుండా నష్టపరిహారం ఇచ్చేందుకు స్పెషల్​ ప్యాకేజీ కేటాయించాలని యోచిస్తోంది.

ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు..

మహేశ్వరం నియోజకవర్గంలో ఎడ్యుకేషన్​ హబ్​, ఎంటర్​టైన్​మెంట్​ హబ్​, హెల్త్​ హబ్​, ఆర్టిఫీషియల్​ ఇంటలిజెంట్​ హబ్​, టూరిజం హబ్​లుగా ఏర్పా టు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోం ది. వీటితో పాటు హార్డ్​వేర్, సాఫ్ట్ వేర్ రంగాలను ఏర్పాటు చేసేందుకు మరొక ప్రణాళిక రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి నేతృత్వంలో జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్​ బాబు ఆధ్వర్యంలో ప్రతి రోజూ సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ కంపెనీల ఏర్పాటుతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు లక్షల్లో ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చూడుతుంది. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ప్రతి కంపెనీకి అనుబంధంగా ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏ ర్పాటు చేయాలని యోచిస్తోంది. దీంతో నిరుద్యోగ సమస్యలకు చెక్​ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రతి కంపెనీ నిర్మాణం వెనుక భారీ లక్ష్యం ఉన్నట్లు అధికార పార్టీ నేతలు వివరిస్తున్నారు. కేవలం దేశంలోనే అగ్రగామిగా కాకుండా ప్రపంచ స్థాయిలో అవసరమైన ఉత్పత్తులను అందించాలనే లక్ష్యంతో కంపెనీల ఏర్పాటులో నిమగ్నమైనట్లు అధికారులు వివరిస్తున్నారు.

Similar News