పంటలు పండించే భూమికే రైతు భరోసా అందించాలి : కసిరెడ్డి నారాయణరెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజా పాలన కోసమే పని

Update: 2024-07-03 12:06 GMT

దిశ, తలకొండపల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ప్రజా పాలన కోసమే పని చేస్తుందని, గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను గుర్తించడానికే ప్రత్యేక ప్రజా అభిప్రాయ సేకరణను ఏర్పాటు చేయడం జరిగిందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు గట్ల కేశవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి, పీసీసీ సభ్యులు ఆయిల్ శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ, జిల్లా అధికారులు కేఎల్ఎన్ చారి,శారదమ్మలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణలో పలువురు రైతులు మాట్లాడుతూ రైతే రాజని సన్న చిన్న కారు రైతులందరికీ ప్రభుత్వ పలాలు అండే విధంగా చూడాలని, గ్రామాలలో గుట్టలు రోడ్లు, కొండలు, మైనింగ్లు లాంటి వాటికి రైతుబంధు సాయం నిలిపివేయాలని ముక్తకంఠంతో పేర్కొన్నారు.

వ్యవసాయం చేసే రైతుకు మాత్రమే రైతుబంధు ఇవ్వాలని, మరి కొంతమంది రైతులు మాట్లాడుతూ ఎకరాలతో సంబంధం లేకుండా బాగు చేసే ప్రతి ఎకరాకు సాయం అందించాలని అభిప్రాయం వ్యక్తపరిచారు. వ్యవసాయ పనిముట్లు డ్రిప్పులు, స్పిన్క్లర్స్, సబ్సిడీపై అందించి రైతు బీమా కూడా వచ్చే విధంగా చూడాలని పేర్కొన్నారు. పి ఎస్ ఎస్ చైర్మన్ కేశవరెడ్డి మాట్లాడుతూ 10 నుండి 15 ఎకరాల రైతులకు రైతుబంధు, కుంట భూమి ఉన్న కూడా ప్రతి రైతుకు రైతు బీమా, రైతు భరోసా క్రింద పంటల భీమా వచ్చే విధంగా చూడాలని అన్నారు. చివరకు కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ సేద్యం చేసే ప్రతి ఎకరాకు రైతుబంధు అందించాలని, గ్రామాలలో ఉన్న సన్న చిన్నకారు రైతులు 5 ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు ఇస్తే పండించే పంటలు మొత్తం రాష్ట్ర ప్రజలకు సరిపడా అందించలేక పోతామని, సబ్సిడీపై వ్యవసాయ రైతు పనిముట్లు, సేద్యం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా అందే విధంగా చూడాలని రైతుగా అతని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జూలై మాసం చివరి వరకు రెండు లక్షల రుణమాఫీ జరిగి తీరుతుందని,రైతు బీమాను కూడా కొనసాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూర్ ప్రభాకర్ రెడ్డి, శతాబ్ది టౌన్షిప్ మేనేజింగ్ డైరెక్టర్ కాసు శ్రీనివాస్ రెడ్డి, డిసిసి మోహన్ రెడ్డి, సునంద అంజయ్య గుప్తా, భగవాన్ రెడ్డి, రవీందర్ యాదవ్ , అజీమ్ , మాజీ ఎంపీపీ రఘురాములు,పిఎసిఎస్ ఈవో ప్రతాపరెడ్డి, వ్యవసాయ అధికారి రాజు, రంగారెడ్డి, రాములు ,తిరుపతిరెడ్డి, మైసయ్య ,జగ్గారెడ్డి, శంకర్ ,శ్రీనివాస, రమేష్, పవన్ వాల్మీకి, బాల్ రెడ్డి, విఠలయ్య గౌడ్, పిఎసిఎస్ డైరెక్టర్లు శ్రీనివాస్ ,రవీందర్ రెడ్డి, యాదయ్య గౌడ్, దేవుల నాయక్ తదితరులు పాల్గొన్నారు.


Similar News