అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

జిల్లాలోని వికారాబాద్ మున్సిపల్ పరిధి అనంతగిరిపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను

Update: 2024-07-05 15:45 GMT

దిశ ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలోని వికారాబాద్ మున్సిపల్ పరిధి అనంతగిరిపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ పరామర్శిచారు. డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డిలు ఉన్నారు.

అనంతరం అనంతగిరిపల్లిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి హాస్టల్లోని విద్యార్థుల బాగోగులు, వసతులను చూసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని వంటగది, భోజనశాల, డార్మెంటరీ రూమ్ లను తిరిగి చూశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ హాస్పిటల్ లో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అదేవిధంగా హాస్టల్ లో ఉన్న చిన్న చిన్న మరమ్మతులను అతి తొందరలో చేయిస్తామని, అదేవిధంగా హాస్టల్లో వార్డెన్ కూడా నియమించేలా చూస్తామని అన్నారు. అనంతరం అక్కడున్న విద్యార్థులతో కలిసి స్పీకర్ తో పాటు జిల్లా కలెక్టర్, ఇతర నాయకులు భోజనం చేశారు.


Similar News