జిల్లా పోలీసుల బదిలీలు, సస్పెన్షన్లు

మల్టీ జోన్ - 2 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్

Update: 2024-10-03 16:29 GMT

దిశ, ప్రతినిధి వికారాబాద్/తాండూరు : మల్టీ జోన్ - 2 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.సత్యనారాయణ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా తాండూర్ టౌన్ ఇన్స్పెక్టర్ సంతోష్, కరణ్ కోట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ లు ఐజి ఆఫీస్ కి అటాచ్ చేయడం జరిగింది. అలాగే పెద్దేముల్ ఎస్సై గిరెన్న, యాలాల ఎస్సై శంకర్ లు జిల్లా ఎస్పీ ఆఫీస్ కు అటాచ్ చేసినట్లు జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం వికారాబాద్ పట్టణ సీఐ గా విధులు నిర్వహిస్తున్న ఏ.నాగరాజు పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. గతంలో జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన కేసు దర్యాప్తులో అలసత్వం వహించడమే కాక, అవకతవకలకు పాల్పడ్డాడని మల్టీ జోన్ - 2 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి.సత్యనారాయణ ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.


Similar News