ముప్పై ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్న సబ్ రిజిస్టర్ ఆఫీస్.. అంతా ఆయన కనుసన్నల్లోనే..

పెద్ద అంబర్పేట పరిధిలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ గత 30 ఏళ్లుగా అద్దె

Update: 2024-07-03 11:31 GMT

దిశ,అబ్దుల్లాపూర్మెట్ : పెద్ద అంబర్పేట పరిధిలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ గత 30 ఏళ్లుగా అద్దె భవనం లో కొనసాగుతోంది. 1995లో ఏర్పడిన రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న నాలుగు ఐదు గ్రామాల ప్రజలకు అందుబాటులో వచ్చింది. నాటి నుంచి నేటి వరకు అద్దె భవనాల్లోనే ఇరుకు గదుల్లోనే అధికారులు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చే ప్రజలకు కనీస సౌకర్యాలు అయిన కుర్చీలు బెంచీలు తాగునీరు సౌకర్యం వంటి సదుపాయాలు కూడా లేకపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఒక్కొక్క రిజిస్ట్రేషన్ కు గంటల తరబడి సమయం పడుతుండడంతో కాల కృత్యాలు తీర్చుకునేందుకు కూడా సరైన మరుగుదొడ్లు లేకపోవడంతో ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రజలు కూర్చోడానికి కుర్చీలు లేక చంటి పిల్లలతో రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వచ్చేవారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు మూడు కుర్చీలు మినహా పెద్ద సౌకర్యాలు ఏమి లేకపోవడంతో చంటి పిల్లలను ఎత్తుకొని తమ పనులు కష్టమైన ముగించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.

అంతా ఆయన కనుసన్నల్లోనే...?

పెద్ద అంబర్పేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కనుసన్నల్లోనే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగే కార్యకలాపాలని కొనసాగుతున్నాయి. ఎటువంటి లిటిగేషన్ సమస్య ఉన్న చేసేందుకు అధికారులు కొంత వెనుక ముందుకు వెళ్లినప్పటికీ ఆయన కంటి సైగతోనే సబ్ రిజిస్ట్రేషన్ అధికారిగా సీట్లో ఉన్నవారు మెలగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటువంటి సమస్య తో రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా స్థానికంగా ఉన్న ఆయన చెప్తే నిజమే అన్నట్టుగా సదరు అధికారి తల ఊపాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి లిటిగేషన్ ఉన్న రిజిస్ట్రేషన్ కైనా డబ్బులు ఆయనకు అప్పచెప్పితే అధికారులు ఇట్టే చేసేస్తారు. ఆయన స్పందించకపోతే ఇటువంటి మంచి పనయినప్పటికీ కూడా జరగాల్సిందేనని చర్చించుకోవడం విచారకరం. స్థానికుడు కావడంతోపాటు కార్యాలయం లో చాలా రోజులుగా విధులు నిర్వహించడం తో ఆయనకు అంత తెలిసి ఉంటుందన్న భావించే అధికారులు ఆయన చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారని సమాచారం.

చందాలతో అద్దె కడుతున్న డాక్యుమెంట్ రైటర్లు...?

పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అద్దె చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి కొంతవరకే అద్దె చెల్లించాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ సదరు భవనానికి అంత తక్కువ అమౌంట్ కు కిరాయికి ఇవ్వకపోవడంతో డాక్యుమెంట్ రైటర్లకు సంబంధించిన కొంతమంది చందాలుగా వేసుకుని అద్దెనికాడుతూ తమ పనులను సాఫీగా ఈజీగా జరుపుకుంటున్నారన్న విశ్వసనీయ సమాచారం. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కు కొత్త భవనం కావాలని ఉన్న ప్రస్తుత ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నోటీసులు అతికించడం తో పాటు నూతనంగా సంఘీ రోడ్ లో భవనాన్ని కూడా చూసిన ప్రాంతంలో ఎక్కువ భాగం డాక్యుమెంట్ రైటర్ అదే ఉన్నట్లు సమాచారం.

ముందే వారందరూ అనుకున్న ప్రాంతంలో అప్పటికప్పుడు షేటర్ లు నిర్మిస్తూ కార్యాలయం మారిన క్షణం నుంచి తమ వ్యాపారానికి ఎటువంటి అడ్డంకులు ఉండకూడదని పక్కాగా డాక్యుమెంట్ రైటర్లు పలువురు నిమగ్నమైన ట్లు సమాచారం. ఏది ఏమైనా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రజల సౌకర్యాలతో పాటు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్న వ్యవహారం తో పాటు డాక్యుమెంట్ రైటర్ల చందాలతోనే అద్దె భవనం నడుస్తోంది అన్నట్లుగా పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పక్కా భవనం అయితే బాగుండడంతో పాటు ప్రజలకు సౌకర్యార్థంగా సౌకర్యాలతో ఉండాలని కోరుతున్నారు.


Similar News