దర్జాగా కాలువ కబ్జా.. చినుకు పడితే ఇండ్లన్నీ నీళ్లలోనే..

Update: 2024-08-30 10:20 GMT

దిశ, షాద్ నగర్ః ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు జోరుగా కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపి ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది ఈ హైడ్రా. హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయొద్దంటూ డిమాండ్ కూగా గట్టిగానే వినిపిస్తుంది. ఎందుకంటే ఒక్క హైదరాబాద్ లోనే కాదు భూమికి డిమాండ్ ఉన్న ప్రతిచోట చెరువులు, కుంటలు, కాలువలు కబ్జాకు గురికాబడ్డవి. ముఖ్యంగా హైదరాబాద్ కు అతి సమీపంలో మిని ఇండియాగా పేరొందిన కొత్తూర్ మున్సిపాలిటీలో అక్రదారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. షాద్ నగర్ నియోజక వర్గం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో సాయి రెడ్డి చెరువు నుండి కాశన్న కుంట వరకు గల పాటు కాలువ సమీపంలో సర్వే నంబర్ 19, 20లతో ఎల్ పి నెంబర్ 25/08/HRO/H2 తొ 2008 లో రియల్టర్లు రియల్టర్లు గణపతి వెంచర్ చేసి ప్లాట్లు అమ్మేశారు. ఆక్రమణదారుల, రియల్ వ్యాపారుల పుణ్యమాని ఈ కాల్వలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. సుమారు కిలోమీటరున్నర దూరం పొడవు మేర ఉన్న వరద కాల్వను ఆక్రమణదారులు మెల్ల మెల్లగా ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించారు. అదేవిధంగా గణపతి వెంచర్ సమీపంలో సాయి రెడ్డి చెరువు నుండి కాశన్న కుంట వరకు పారుతున్న పాటుకాలను కబ్జా చేసి ఏమీ ఎరగనట్టు పాటు కాలువను దారి మళ్లించారు. కాల్వ అక్రమ గురవుతున్నదని, దానిపై అక్రమ నిర్మాణాలను తొలగించి మనుగడను కాపాడాలని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు సైతం చేశారు.ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కానరావడం లేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఓ బడా నాయకుడు కాలువను కబ్జా చేసి ఏకంగా గోదాంలనే నిర్మించారు. కాసుల కోసం కక్కుర్తి పడి గోదాములకు అడ్డొస్తుందన్న నెపంతో పాటు కాలువను దారి మళ్లించి అనేక నిర్మాణాలు చేపట్టారు. ఈ కాలువను కబ్జా చేయండం వల్లా భారీ వర్షాలు కురిసినప్పుడు గణపతి కాలనీ అంతా వర్షంపు నీటితో నిండి ఇంట్లోకి వెళ్లే పరిస్థితి లేదని స్థానికులు వాపోతున్నరు. అదేవిధంగా మహిళా సమాఖ్య భవనం కూడా నీటితో నిండిపోతే కనీసం మహిళలు లోపలికి వెళ్లే పరిస్థితి కూడా లేదు.ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు స్పందించడంలేదని.. ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు అధికారులు తలొగ్గకుండా పాటు కాలువను పరిరక్షించాలని కోరుతున్నారు.  


Similar News